తూప్రాన్ మండల్ సేవకుల గ్రామానికి చెందిన కమ్మరి బ్రహ్మచారి ఆకస్మికంగా మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న చిన్ననాటి మరియు సహచర స్నేహితులు స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం(91,500) అందించడం జరిగినది. బ్రహ్మచారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఆ కుటుంబానికి చేతనైన సహాయం అందిస్తామని శాకారం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు . గురువారం యావపూర్ లోని బాధిత కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు . ఈ సందర్భంగా మిత్రులు భాస్కర్ గౌడ్ , యతీష్ గౌడ్ , కర్ణాకర్ గౌడ్ , లక్ష్మణ్ గౌడ్ తదితరుల మిత్ర బృందం రూ 91500 ల ఆర్థిక సహాయం అందజేశారు . చిన్ననాటి మిత్రుడైన బ్రహ్మచారికి భార్యతో పాటు ముగ్గురు కూతుర్లు ఉండగా , కడు పేదరికం అనుభవిస్తున్నట్లు చెప్పారు . ఈ విషయం తెలుసుకున్న చిన్ననాటి మిత్రులం ఆ కుటుంభానికి తమ వంతు సహకారం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు . ఎప్పుడో విడిపోయిన చిన్ననాటి మిత్రులు తమ దాతృత్వాన్ని చూపడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు .




