ప్రాంతీయం

రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం..రైతు పండించిన ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది… మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.

123 Views

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ , సింగాటం గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఐకేపీ వారి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ప్రారంభించడం జరిగింది.అదేవిధంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ట్లో fdc చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, జడ్పీటిసి మల్లేశం , ఆత్మకమిటి చైర్మన్ కృష్ణ రెడ్డి, భారస మండల అధ్యక్షుడు బెండే మధు, టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా రైతుబందు మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి లతో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది అని తెలిపారు.రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్ అని వారు చేపట్టిన సంస్కరణలు, పథకాల కారణంగా వ్యవసాయము దండగ అన్న ఒకప్పటి పాలకుల మాటలను అబద్ధం అని చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ల్గారిదన్నారు.సాగు నీటిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో రాష్ట్రంలో అనూహ్యంగా పంట దిగుబడి పెరిగింది అన్నారు. దళారుల బెడదను అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారిలో ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం ధైర్యం నింపిన మహనీయులు కేసీఆర్ అన్నారు.రైతుల కష్టాలను గుర్తించి మొన్న వడగండ్ల వానకు తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేసే విదంగా అధికారులను ఆదేశించిన విషయాన్ని వారు స్పష్టంచేశారు.అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా దళారుల బెడద కూడా లేకుండా పోయిందన్నారు. రైతుల కండ్లల్లో సంతోషం చుఫేటమే లక్ష్యంగా పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర రూ.2060 అందిస్తున్న విషయాన్ని వారు ల్తెలిపారు. రైతులు అందరూ ఎండ భేటిన నాణ్యమైన దాన్యానని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.గ్రామీణ ఆర్దిక వ్యవస్థ ల్బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు అని అన్నారు.పెట్టుబడి సాయంతో బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కొత్త చరిత్రను సృష్టించిందని రైతు శాసించే స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉద్దేశ్యం అన్నారు.దేశంలోనే ఏ రాష్ట్రంలోని విధంగా రైతులకు పెట్టుబడి ఎకరానికి పంటకు 5000 రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని గుర్తు చేశారు .దేశం మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వైపే చూస్తున్నాయి దేశానికి వారి నాయకత్వం అవసరం అని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.సాగునీటి పథకం వల్లే అద్భుత ఫలితాలు రావడం జరుగుతుందని భారతదేశానికి అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు..ఈ కార్యక్రమంలో గడ ప్రతేకాధికారి ముత్యం రెడ్డి, వైస్ చైర్మన్ జఖి ఉద్దీన్, వైస్ ఎంపీపీ కృష్ణ గౌడ్, మార్కెట్ సెక్రెటరీ జాన్వెస్లీ, ao నాగరాజు, apm యదగిరి,కౌన్సిలర్ శ్రీనివాస్, వివిధ కమిటీల డైరెక్టర్స్ మతిన్, భాస్కర్ రెడ్డి, మల్లేశం, ప్రవీణ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, రమేష్ గౌడ్, అహ్మద్, నిజామోద్దీన్, బుచ్చిరెడ్డి, సాయిరెడ్డి, భూమయ్య, అధికారులు, మహిళ సంఘం వారు, రైతులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *