ప్రాంతీయం

హత్యయత్నం కేసులో నిందితునికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

45 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*హత్యయత్నం కేసులో నిందితునికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష*

మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 22.07.2018న జరిగిన హత్యాయత్న కేసులో నేరం రుజువుకావడంతో నిందితుడికి కోర్టు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000/- జరిమానా విధించింది.

ఈ కేసులో కోహినూరు దక్షిణామూర్తి S/o పాండురంగ, నివాసి–మందమర్రి పెట్రోల్ బంక్ సమీపంలో, డబ్బుల లావాదేవీల విషయంలో జరిగిన గొడవలో దసుకుంట్ల కుమారస్వామి @ వరిగేష్ చంపాలనే ఉద్దేశంతో కత్తితో దాడి చేయగా బాధితులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మందమర్రి పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఎస్సై పి.సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో విచారణ జరిపిన అనంతరం నేరం రుజువైనందున ఏ. నిర్మల, సీనియర్ సివిల్ జడ్జి, మంచిర్యాల ఈరోజు శిక్ష విధించారు.

ఈ కేసులో నేరం రుజువు కావడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంది రవీందర్  కీలక పాత్ర పోషించారు. మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ బెల్లంపల్లి ఏసీపీ ఏ. రవికుమార్ పర్యవేక్షణలో మందమర్రి సీఐ పి. రమేష్, ఎస్‌ఐ జి. నరేష్, కోర్ట్ కానిస్టేబుల్ ఇ. సురేందర్ (పీసీ -1445), లైజన్ ఆఫీసర్లు సి హెచ్. వెంకటేశ్వర్లు (హెచ్ సి -2053) తదితరులు సమర్థవంతంగా సహకరించారు. ఈ సందర్భంగా రామగుండం డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా ప్రాసిక్యూషన్ బృందాన్ని అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *