ప్రాంతీయం

జూనియర్ పంచాయితీ కార్యదర్శి లను వెంటనే పర్మినెంట్ చెయ్యాలి… కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…

222 Views

 ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో తంగల్లపల్లి మండల కేంద్రంలో శాంతియుతంగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయితీలను బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ సంఘీభావం తెలియజేశారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ జూనియర్ పంచాయితీ కార్యదర్శులను వెంటనే పర్మెంట్ చేస్తూ 4, సంవత్సరాల ప్రోబిషన్ పీరియడ్ ను రెగ్యులర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంకి కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డ్ లకి కారణం ఎవరు అని ప్రశ్నించారు. రాత్రి పగలు, ఎండ వాన అనక విధులు నిర్వర్తించే ఇలా సమ్మె లు చేపించడం తగదు అని అన్నారు. ఒక్క గ్రామం డెవలపమెంట్ కి పంచాయితీ కార్యదర్శి కీలక పాత్ర అని గుర్తు చేశారు. వీళ్ళు చేసే శాంతియుత సమ్మేకి బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి మద్దతు వుంటుంది అని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జూనియర్ పంచాయితి కార్యదర్శిలను వెంటనే 4, సంవస్సరాల పీరియడ్ ను కలుపుకొని పరిమినెంట్ చెయ్యాలని అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్, సిరిసిల్ల మండల అధ్యక్షులు మట్టే నరేష్,నాయకులు పోతర్ల వంశీ, పోతర్లా గణేష్, సాయి, నవీన్,రాజు లు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *