మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలో
“శ్రీకృష్ణ వేణి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు”.
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకృష్ణ వేణు హై స్కూల్ లో ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి పూలను దైవంగా ఆరాధించే పండుగ బతుకమ్మ అమావాస్య రోజు నుండి తొమ్మిది రోజు ల పాటు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు.
మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి గౌరీదేవిని పూజించి ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటారు. తంగేడు, గునుగు,బంతి, చామంతి, కట్ల, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, మందార, పారిజాతము, కమలము, తామర, గన్నేరు, వంటి రంగుల పూలచే అలంకరించి ఆటపాటలతో బతుకమ్మ ఆడుకుంటారు చివరి రోజు సద్దుల బతుకమ్మ బతుకమ్మను బీడ్కోలు పలికి సత్తులు వాయినం గా స్త్రీలు పంచుకుంటారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.





