నాణ్యత లేని పోలో రింగ్ తయారీ గోదాంపై హెచ్- ఫాస్ట్ అధికారుల దాడులు.
ఏప్రిల్ 08, తెలుగు న్యూస్ 24/7
హైదరాబాద్‌లోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పోలో రింగ్ తయారీ గోదాం నిర్వహిస్తున్నట్లు( హెచ్- ఫాస్ట్) అధికారులు గుర్తించారు. నాణ్యత లేని,ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు దాడుల్లో తేలింది.అధికారులు భారీగా ముడి పదార్థాలు,తయారైన పోలో రింగులు, యంత్రాలను స్వాధీనం చేసుకుని గోదాంను సీజ్ చేశారు.నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు..





