ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2,రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన పోలీస్ క్రీడా పోటీల ముగింపు వేడుకలో మంత్రి కేటీఆర్ పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం జిల్లాలో మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘అభయ’ యాప్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
