కుటుంబ సభ్యుల చెంతకు చేరిన కమల…
మండలం లోని మద్దిమల్ల గ్రామ కాశీ తండాకు చెందిన మాలోత్ కమల శుక్రవారం రాత్రి కుటుంబ కలహాల కారణంగా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి కి వెళ్లగా ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఎల్లారెడ్డి పేట లోని డే కేర్ సెంటర్ లో చేర్పించగా ఇట్టి విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలపగా శనివారం మద్దిమల్ల కాశీ తండా నుండి వచ్చిన కమల భర్త బాస్కర్, ఆమె కూతురు మంగకు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, డే కేర్ సెంటర్ ఇంచార్జ్ మమత లు కమల ను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్బంగా ఆమె కుటుంబ సభ్యులు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు, రాత్రిపూట ఆశ్రయం కల్పించిన డే కేర్ సెంటర్ ఇంచార్జ్ మమత కు ధన్యవాదములు తెలిపారు.ఒగ్గు బాలరాజు యాదవ్ ఆటోలో కమల ను మద్దిమల్ల కు తరలించారు.
