దేశంలో ఎక్కడా లేనివిధంగా విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ఆశీర్వదించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి అన్నారు.
బుధవారం సిరిసిల్ల పట్టణంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనీ కాన్ఫరెన్స్ హల్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు.బ తుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
