గూడూరు పట్టణంలో. సోమవారం రోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఇటీవల “బుడమేరు” పొంగడంతో విజయవాడ లోని పలు ప్రాంతాలు జలమయమై వారం రోజులు పైబడి నీటిలోనే ఉంటూ అవస్థలు పడుతున్న ప్రజలను ఆదుకొని వారి ఆకలి తీర్చడం కోసం గూడూరు సి.పి.ఎం. పార్టీ సి.ఐ.టి.యు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విరాళాల సేకరణకు మాయాబజార్ నుండి ప్రారంభించి వివేకానంద రోడ్, ముత్యాల పేట, గాంధీ మున్సిపల్ బిల్డింగ్స్, ఎన్టీఆర్ కాంప్లెక్స్, మరియు పూల వ్యాపారస్తులు దగ్గర నుంచి వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించిన మొత్తం 8,850/- ఎనిమిది వేల ఎనిమిది వందల యాబైరూపాయలు దాతలు నుండి సేకరించిన మొత్తం రాష్ట్ర కమిటీకి పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం.శాఖ కార్యదర్శి జోగి శివకుమార్ సి.ఐ.టి.యు జిల్లా కమిటీ సభ్యులు పి.శ్రీనివాసులు, సి.ఐ.టి.యు.నాయకులు బి.వి.రమణయ్య,ఎస్.సురేష్,పామంజీ మణి,అడపాల ప్రసాద్, పుట్టా శంకరయ్య, సేలం శేఖరా చారి,వినయ్, బి.చంద్రయ్య,జాని, తదితరులు పాల్గొన్నారు.5
