తొగుట: పంట చేతికి వొచ్చే సమయంలో వడగండ్ల వర్షం మూలంగా రైతులకు తీరని నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నేరు హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.. వడగండ్ల మూలంగా నష్టపోయిన మండలంలోని వర్ధరాజ్ పల్లి, గోవర్ధనగిరి, గుడికందుల గ్రామాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి మంత్రి పరిశీలించారు.. వర్ధరాజ్ పల్లి లో టమాటా తోటను, గోవర్ధనగిరి, గుడికందుల గ్రామాల్లో వరి పంటను పరిశీలించారు.. ఈసందర్భంగా మంత్రి గారిని చూసి రైతులు బోరుమన్నారు..చేతికి వొచ్చిన పంట కళ్ళ ముందే కరాబు అయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు..సీఎం కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు అధైర్య పడవొద్దని ఆయన భరోసా ఇచ్చారు. మీకు ఉచిత కరెంటు ఇచ్చారు..సాగునీళ్లు ఇచ్చారు..రైతు బంధు, రైతు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.. ప్రకృతి వైపరీత్యం మూలంగా తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు.. నష్టపోయిన ఎకరాకు రూ.10 వేల ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు..అన్ని రకాల పంటలకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వడగండ్ల మూలంగా ఆస్తులకు ఏమైనా నష్టం వాటిల్లితే వారికి కూడా పరిహారం అందిస్తామన్నారు..పంట పొలం ఎవరు సాగు చేస్తే వారికే పరిహారం ఇవ్వడం జరుగుతుందని, కౌలు, పాలుకు చేసే రైతులకు కూడా పరిహారం అందిస్తామన్నారు.. వ్యవసాయాధికారులు నష్ట పరిహారం జాబితా తయారు చేసేటపుడు సరైన వివరాలు ఇవ్వాలన్నారు..తొగుట మండలంలో వడగండ్ల వర్షంతో నష్టపోయిన ఈ గ్రామాలతో పాటు ఘనపుర్, ఎల్లారెడ్డి పేట, పెద్దమాసాన్ పల్లి, బండారు పల్లి తదితర గ్రామాల రైతులకు కూడా పరిహారం అందిస్తామన్నారు..కాగా వర్ధరాజ్ పల్లి నుండి మర్రికుంట రోడ్డు ను బీటీగా మార్చాలని మంత్రివర్యులు హరీష్ రావు దృష్టికి సర్పంచ్ చెత్రి రాజవ్వ తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. .కార్యక్రమంలో తహసీల్దార్ జహీర్, వ్యవసాయాధికారి మోహన్,ఆర్ఐ అశోక్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, రైతు బంధు అధ్యక్షుడు బోధనం కనకయ్య, కో అప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, సర్పంచ్లు తోయేటి ఎల్లం, చెత్రి రాజవ్వ, గంగానిగాళ్ల మల్లయ్య, మండల యూత్ అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్, ఉప సర్పంచ్లు రాజిరెడ్డి, రమేష్, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, బక్క కనకయ్య, మెట్టు స్వామి, చెత్రి శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి, బైరయ్య, కనకయ్య, బోయిని శ్రీనివాస్, పులిరాజు, బైరాగౌడ్, బైరారెడ్డి, దుబ్బాక కనకయ్య, నంట పరమేశ్వర్ రెడ్డి, బాల్ రెడ్డి, బాలరాజు, స్వామి రెడ్డి, రాఘవులు, శ్రీనివాస్ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు..
