ప్రాంతీయం

బంజరు పల్లె సర్పంచ్ బరిలో

57 Views

బంజరు పల్లె సర్పంచ్ బరిలో రిక్కల లతా రాజిరెడ్డి

ప్రజా సమస్యలపై అవగాహన నిత్యం ప్రజలతో సావాసం 

సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజల ఆడబిడ్డగా పనిచేస్తా 

సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7 డిసెంబర్ 7

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని బంజరుపల్లె సర్పంచ్ అభ్యర్థిగా రిక్కల లతా రాజిరెడ్డి అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గతంలో బంజరుపల్లె గ్రామంలో సామాజికంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినారన్నారు. ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రజల్లో ఒకడిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయామని గ్రామంలో పాఠశాల యొక్క స్థితిగతులను మార్చారమన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం పాఠశాల అభివృద్ధి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి పొన్నం ప్రభాకర్, సహకారంతో చేపట్టడం జరిగిందన్నారు. అయితే లతా రాజిరెడ్డిని సర్పంచ్ గా గెలిపిస్తే వారు బంజరపల్లి గ్రామం నుండి బంజరుపల్లె ప్రధాన రోడ్డు వరకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు మరియు రోడ్ నుండి లోపలి వరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తానన్నారు. అంతేకాకుండా పాఠశాల యొక్క స్థితిగతులను మార్చి పిల్లలను ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాల వెళ్లే విధంగా గ్రామాన్ని తీర్చిదిద్దుతానని, బతుకమ్మ ఘాటును ఏర్పాటు చేసి మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనువుగా ఘాటును తీర్చిదిద్దానని ఊరి చెరువును మరమ్మతులు చేస్తానని అంతేకాకుండా మహిళలకు మహిళా సంఘం భవనము కమ్యూనిటీ భవనము కమ్యూనిటీ హాల నిర్మాణము చేస్తానని ఒక మహిళగా ఒక ఇంటిని చక్కదిద్దే వ్యక్తిగా ఊరుని గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దడంలో నా వంతు పాత్ర నిర్వహి స్తానన్నారు. బంజరుపల్లె గ్రామాన్ని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ 24 గంటల్లో అందుబాటులో ఉంటానని బంజరుపల్లి గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చితే బాధ్యత నాదని ఈ సందర్భంగా లతా రాజిరెడ్డి తెలిపారు. తమకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఊరును అభివృద్ధి దిశగా పయనించుటలో ప్రజలు అధిక సంఖ్యలో తమ మద్దతు తెలిపాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *