ప్రాంతీయం

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఒకరికి రెండు రోజులు ట్రాఫిక్ డ్యూటీలు శిక్ష

109 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఒకరికి రెండు రోజులు ట్రాఫిక్ డ్యూటీలు శిక్ష*

మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల తీర్పు నిచ్చారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ 20 మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వారిని విచారించిన న్యాయమూర్తి గారు మంజుల 20 మందికి 23 వేల రూపాయల జరిమానా విధించారు. అయితే అత్యధికంగా మద్యం సేవించి వాహనం నడిపిన *కమాన్ పూర్ కు చెందిన ఇందారపు రమేష్ కు 500 రూపాయల జరిమానా తో పాటు సామాజిక సేవలో భాగంగా రెండు రోజులపాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పునిచ్చారు. శని, ఆదివారాల్లో రమేష్ ట్రాఫిక్ విధుల్లో ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.* మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

అనిల్ కుమార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్,పెద్దపల్లి, తెలియజేసారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్