ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 20, ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు ఇబ్బందులు జరగకుండా అదనపు గదులు నిర్మాణం చేపడుతున్నటువంటి క్రమంగా సమీపంలో బండరాయిని తొలగించేందుకు జిలేటిన్ స్టిక్స్ ను పేల్చారు. ఆ భారీ శబ్దాలకు బండరాళ్లు ఎగిరి ఆసుపత్రి భవనంపై పడడంతో కొంత మేరకు పగుళ్లు ఏర్పడ్డాయి. బండరాయిని తొలగించే నిర్వాహకులు ఆస్పత్రి వైద్యులకు ఎలాంటి సమాచారం అందించకుపోవడం చర్చనీయాంశంగా మారింది. అటుగా వస్తున్న ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండాపోగ ఇబ్బందులు జరగకుండా పేలుళ్ల నిర్వాహకులు చాకచౌక్యంగా నిర్వర్తించాలని తోటధర్మేందర్ తో పాటు గ్రామస్తులు కోరారు. సంబంధిత ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బందితో పాటు రోగులు ఊపిరి పీల్చుకున్నారు.
