Breaking News

ఈరోజు ఉదయం 10 గం. ల నుండి శ్రీరంగనాథస్వామి వారి దివ్య మూలమూర్తికి, విగ్రహ మూర్తులకు అభిషేకం జరిగింది…

131 Views

*జై శ్రీరంగనాథ*

ఈరోజు ఉదయం 10 గం. ల నుండి శ్రీరంగనాథస్వామి వారి దివ్య మూలమూర్తికి, విగ్రహ మూర్తులకు అభిషేకం జరిగింది… *దీనినే తిరుమంజన స్నపనము అంటారు…* నవకలశాలలో పంచామృతములు, పళ్లరసాలు, సువాసన ద్రవ్యములు కలిపిన పవిత్ర జలముతో నింపి, ఆ కలశాలలోకి అధిదేవతలను ఆవాహన చేసి, ఆ జలముతో వేదమంత్రోచ్ఛారణ వైభవంగా స్వామివారి మధ్య అభిషేకం. ….

*ఈ విధానం యాదాద్రి వంటి ప్రసిద్ధ క్షేత్రాలలో జరిగే సంప్రదాయం…*

ఇవాళ మరో విశేషం – *శ్రీ మొర్సు భాస్కరరెడ్డిగారు* మూలస్వామికి దివ్యమైన మకరతోరణాన్ని సమర్పించారు…దీనివల్ల దివ్యమైన కళ చేకూరింది…
అభిషేక ఉత్సవం తాలూకు సంప్రదాయ విశేషాలను *శ్రీమాన్ దరూరి నరసింహాచార్యులు గారు* వివరిస్తుంటే స్వామికి దివ్యమైన అలంకారం జరిగింది… అనంతరం
తీర్థప్రసాద వితరణతో ఉదయం కార్యక్రమం అద్భుతంగా ముగిసింది. ….
*మన గ్రామానికి శ్రీరంగనాథుని రక్ష వుండుగాక..!*
????????????????
శేషు ఆచార్య

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *