జగదేవపూర్ మండలం లోని తిగుల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ముస్లిం కుటుంబాలకు స్థానిక సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు ఆంజనేయులు, లక్ష్మి, మైనారిటీలు తదితరులు ఉన్నారు.