తొగుట; మండలంలోని వేంకట్రావుపేట లో ఈనెల 28 నుండి 29 వరకు జరగనున్న పెద్దమ్మ కల్యాణోత్సవం కు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రిక అందించారు. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మండల ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు కంకణాల నర్సింలు ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు తిప్పరమైన నర్సయ్య, ఎంగలి రాములు, బొగ్గుల నర్సింలు, పంది నర్సింలు, వోలపు నారాయణ, బొగ్గుల బాలయ్య, సుతారి రాంబాబు తదితరులు ఆహ్వాన పత్రిక అందించారు. ఈసందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ పెద్దమ్మ కల్యాణోత్సవం కు హాజరవుతామని , ముదిరాజ్ ల అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు..
