ప్రాంతీయం

పొన్నాల గ్రామంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం..

16 Views

పొన్నాల గ్రామంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం

సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7

కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట  ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్రివే -ఏ లివ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం లో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, పొన్నాల గ్రామంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగా ట్రాఫిక్ ఏసిపి మాట్లాడుతూ వాహనాలు దారులు అందరు కచ్చితంగా హెల్మెట్ ధరించవలెను, బెల్ట్ ధరించవలెనని అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని, మద్యం సేవించి వివాహనాలు నడపకూడదని ఒకవేళ మద్యం సేవించి ఈ వాహనాలు నడుపుతూ పట్టుపడితే పదివేల రూపాయల జరిమాణ విధించబడుతుందని రెండవసారి కూడా మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష కూడా విధించబడుతుందని చెప్పడం జరిగింది, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్  మాట్లాడుతూ రోడ్డుపైన వాహనాలు నడిపేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాక్సిడెంట్ గురైతే వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం గురించి చెప్పడం జరిగింది . ఈ కార్యక్రమంలో కంబోజి రాములు అనే వ్యక్తి 2014వ సంవత్సరంలో యాక్సిడెంట్ గురై తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి తన యొక్క కుడి కాలు కోల్పోవడం జరిగింది, యాక్సిడెంట్ గురైనప్పుడు తను అనుభవించిన బాధ తన కాలు కూలిపోయినప్పటి నుంచి ఇతను పడుతున్న అవస్థల గురించి తెలియజేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు వహిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని  సూచించారు. అలాగే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అందరూ కలిసి గ్రామస్తులతో రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పొన్నాల గ్రామ సర్పంచ్ అమ్ముల వెంకటయ్య , ఉప సర్పంచ్ సృజన సంపత్ యాదవ్, డే వై. డిి ఎం హెచ్ ఓ  డాక్టర్ వినోద్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, పొన్నాల గ్రామస్తులు, యువత పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *