ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 20, ముస్తాబాద్ మండల కేంద్రంలో గోపా మండల కమిటీ ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన సమావేశమై గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షులు గా నూతనముగా ఎన్నికైన కంచర్ల అమరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి లక్ష్మీనారాయణ,జిల్లా ట్రెజరర్ పదిరే బాలా గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్, నాగుల శ్రీనివాస్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, అంజయ్య గౌడ్ ను శాలువాలతో సన్మానించి అభినందించారు. జిల్లా అధ్యక్షులు కంచర్ల అమరేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి లక్ష్మీనారాయణ వీరిని. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోపా సంఘ పటిష్టత కోసం అభివృద్ధి కోసం మాపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి అందరిని భాగస్వాములు చేస్తూ గౌడ విద్యార్థిని విద్యార్థులను విద్యారంగంలో ప్రోత్సహిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈకార్యక్రమంలో కదిర పరశురాములు గౌడ్, బాధవెని అంజయ్య గౌడ్, నామాపురం అశోక్ గౌడ్, అక్కపల్లి లక్ష్మీపతి గౌడ్, మెరుగు నాంపల్లి గౌడ్, కోల దేవరాజు గౌడ్, జవ్వాజి బాలకృష్ణ గౌడ్, బైరి శ్రీనివాస్ గౌడ్ మరియు పదిరే రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




