జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
– – వాహనాల నిర్వహణ సరిగా ఉన్న వారికి రివార్డులు
– – సొంత వాహనాల మాదిరిగా చూసుకోవాలని సూచన
రాజన్న సిరిసిల్ల :తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 25
శుక్రవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లాలోని 13పోలీస్ స్టేషన్ల పరిధిలోని బొలెరో వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ, వాహనాల కండిషన్ పరిశీలించి,డ్రైవర్లకు అవసరమైన సూచనలు చేసిన జిల్లా ఎస్పీ
ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.
తెలంగాణా పోలీస్ శాఖ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఒక్క పోలీస్ అధికారి ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించేలా పెట్రోలింగ్ వాహనాలు మంచి కండిషన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పుడే ఘటనా స్థలాలకు సకాలంలో చేరుకునే అవకాశం ఉంటుందని అన్నారు.డ్రైవర్ ప్రతిరోజు వాహనం యొక్క కండిషన్ గురించి తెలుసుకొని డ్రైవింగ్ చేయాలని సూచించారు, మరియు వాటర్, ఆయిల్ బ్యాటరీ యొక్క కండిషన్ గమనించాలని తెలిపారు. డ్రైవర్స్ కు వాహనం యొక్క మేకనిజమ్ తెలసివుండలి, డైలీ చాట్ మెంటెనెన్స్ చేయలి అని చెప్పారు.ప్రతి రోజు మీరు నడిపే వాహనాలను గమనించాలి, వాహనం లో ఎదైనా డిఫల్ట్ వుంటే వెంటనే మీ యొక్క అధికారులకు తెలిపి వెంటనే సరిచేసుకోవాలి అని అన్నారు.వాహన నిర్వహణ తీరు ఆధారంగా రివార్డులు,పోలీస్ స్టేషన్ల వారీగా ఉన్న వాహనాలను కండిషన్ లో ఉంచుతూ, నిర్వహణ సక్రమంగా ఉన్న వాహనాలను గుర్తించి సంబంధిత డ్రైవర్లకు రివార్డులు అందించి ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు. అదే సమయంలో అసంతృప్తిగా ఉన్న వాహనాలు, వాటి నిర్వహణ పట్ల శ్రద్ధ వహించని పోలీస్ అధికారులు, డ్రైవర్ల పనితీరుపై నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ వాహనాలను స్వంత వాహనాల మాదిరిగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఆయిల్ చేంజ్ తో పాటు వాహనాలను నిత్యం శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుంది అని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు..
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ లు చంద్రకాంత్,రవికుమార్ ఆర్.ఐ. రజినీకాంత్ ,ఆర్.ఐ అడ్మిన్ కుమార స్వామి ఆర్.ఐ యాదగిరి సి.ఐ లు ఎస్.ఐ లుఅధికారులు డ్రైవర్స్ సిబ్బంది పాల్గొన్నారు..





