ప్రాంతీయం

బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫున ముస్లింలకు దుస్తువులు ఇఫ్తార్ విందు…

374 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 19, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు గ్రామాల ముస్లింలకు మాతృశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సాయంత్రం 5.30.గం సమయంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫున దుస్తులు అందించి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా  మండలంలోని ముస్లింలతో పాటు ప్రజాప్రతినిధులు తదితరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎంపీపీ జనగామ శరత్ రావు  మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం  ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక చేయూతనందిస్తూ  వందలాది మంది పేదలకు వైద్య సేవలకోసం  అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కేసిఆర్ కు దక్కిందని  అన్నారు. ఎంపీపీతో పాటు ప్రజాప్రతినిధులు ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లింలకు దుస్తులు అందించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య, మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎద్దండి నరసింహారెడ్డి, ఏనుగు వేణు, సర్వర్ భాష, సాదుల్ పాప, నల్ల నరసయ్య, కోడే శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ముస్లింల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *