ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 17, మండలంలోని గూడెం గ్రామంలో యాసంగి వడ్ల కొనుగోలు సెంటర్ ను ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన ఎంపీపీ జనగామ శరత్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సీజన్ లొ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ముస్తాబాద్ మండలం లోని గూడెం గ్రామంలో (ఐకేపీ) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు నాణ్యమైన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ కు తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని దళారుల మాటలు నమ్మి రైతులు మొసపోవొద్దన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని ఈసంవత్సరం మొట్టమొదటిగా గూడెం గ్రామంలోనే ప్రారంభించామని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ సరిత శ్రీనివాసరావు, జెడ్పిటిసి గుండం నరసయ్య, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు, సెస్ డైరెక్టర్ సంతుపట్ల అంజిరెడ్డి, ఉప సర్పంచ్, మాజీ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, కలకొండ కిషన్ రావు, మాజీ మహిళా అధ్యక్షురాలు కుర్ర సావిత్రి, బిఆర్ఎస్ నాయకులు బాలయ్య, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.
