పార్టీలకతీతంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యులు మైస రాములు
ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు బాకీ స్వామి
సిద్దిపేట జిల్లా గజ్వేల్, నవంబర్ 29
గజ్వేల్ లో స్థానిక సంస్థలను ఎన్నికలను పురస్కరించుకొని పత్రికా విలేకరులతో ఈరోజు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యులు మైస రాములు మాదిగ మా తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి ముదిరాజ్ సంఘం నాయకులు బాకీ స్వామి మాట్లాడుతూ త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎలక్షన్లలో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, సమస్యల సాధన పరిష్కార దిశగా” ఊరికి ఊరేసే వాడుకాకుండా, ఊరికి ఊపిరి పోసేవాడిని”ఎన్నుకోవాలి మరియు చదువుకున్నవాడిని సామాజిక పరిజ్ఞానం ఉన్నవాడిని లోకజ్ఞానం అవగాహన ఉన్న యువకులను సర్పంచ్ గా ఎన్నుకోవాలి, గ్రామాలలో సర్పంచ్ గా అభ్యర్థిని ఊరికి నిబంధనతో, నియతిగా, నిజాయితీగా ఉన్న అభ్యర్థిని గెలిపించుకోవాలి అంతేగాని పార్టీలు పెట్టిన అభ్యర్థిని ఎన్నుకోవడం గ్రామానికి మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం గ్రామ సర్పంచ్ అభ్యర్థులను ఎన్నుకోవాలి తప్ప పార్టీల రంగులను పులిమి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్లో తగాదాలు నెలకొల్పి పార్టీలు పబ్బం గడుపుకోరాదని అన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ప్రకారమే సర్పంచి ఎలక్షన్లు జరగాలి తప్ప వివిధ రాజకీయ పార్టీల జెండాలు కండువాలతో ప్రచారాలు నిర్వహించకుండా ఎన్నికల కమిషనర్ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర రాష్ట్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీలు వారి వారి పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి గ్రామ ప్రయోజనాలే కీలకమంటూ విశాల దృక్పథంతోనే ఎన్నికలను నిర్వహించేల యంత్రాంగానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.





