– నిరుపేద విద్యార్థినీకి ల్యాప్ టాప్ అందజేత
– దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు
దుబ్బాక: మానస ఉన్నత చదువులకు సహాయం చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుబ్బాక మండలం అచ్చమాయ పల్లి గ్రామానికి చెందిన చింతల మానస విద్యార్థినికి ల్యాప్ టాప్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానస జేఈఈ లో ఉత్తీర్ణత పొంది ఐఐటి కాన్పూర్ లో సీటు సాధించడం అభినందనీయమని అన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మానస తన ప్రతిభతో సత్తా చాటి దుబ్బాక పేరు నిలబెట్టిందని అన్నారు. భవిష్యత్తులో చదువుకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. విద్యార్థిని కోరిక మేరకు ల్యాప్ టాప్ ను అందజేసినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థిని మానసను శాలువా కప్పి సన్మానించి అభినందించారు. ల్యాప్ టాప్ అందజేసినందుకు విద్యార్థిని మానస ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు…