క్షణికావేశంతో ఉరి… కన్నవాళ్ళ పరిస్థితి ఏంటి మరి…???. చేతి కందిన కొడుకు ఉరేసుకుని చనిపోయాడు.
పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచుతారు అనేది అనుభవానికి వస్తే కానీ తెలియదు,,,???
అమ్మ పురిటి నొప్పులతో కన్నా, కత్తులతో కడుపు కోసి నిన్ను తీసిన, భయపడదు, బాధపడదు, నొప్పిని భరిస్తుంది, సహిస్తుంది, ఎందుకంటే నువ్వు ఉన్నావన్న సంతోషంతో, నువ్వు తన జీవితంలోకి వచ్చావు అన్న ఆనందంతో,,, నీకోసం నిద్ర లేనిఎన్నో రాత్రులు గడుపుతుంది,నువ్వు హాయిగా నిద్ర పోవాలని, అమ్మానాన్నలు నీకోసం ఎన్ని సంతోషాలు వదులుకుంటారు?ఎన్ని బాధల్ని భరిస్తారు? నువ్వు సంతోషంగా ఉండాలని, నీకు బాధ కలగాకూడద నే కదరా… ఎందుకురా చచ్చిపోయి అమ్మ నాన్నల్ని బాధపెడుతారు, నీకు చిన్న దెబ్బ తగిలిన, కొంచెం జ్వరం వచ్చిన, అమ్మానాన్నలు అల్లాడిపోతారు, అలాంటిది ఇక నువ్వు లేవు, రావు అని తెలిస్తే????? వాళ్ళ ప్రాణం ఎలా కొట్టుకుంటుంది, ఎంత తాళ్లడిల్లి పోతుంది అమ్మానాన్నల ప్రాణం, ఒక్కసారి అమ్మానాన్నల గురించి ఆలోచించాలి కదా, ఒక్క గడియ నువ్వు పనికేని ఆలస్యంగా వస్తే, అమ్మ చూసే ఎదురుచూపులు నీకు తెలియదా, ఇప్పుడు నువ్వు అసలే రావని తెలిస్తే, ఏమై పోతారురా అమ్మానాన్నలు??? నువ్వు ఒక్కరోజు యే ఊరికైనా వెళ్తే ఎప్పుడొస్తాడో కొడుకు అనుకుంటుంది… మరి నువ్విపుడు దేవుడి దగ్గరికి వెళ్ళావ్ నువ్వు రావు, మరెట్ల బతుకుతారు అమ్మానాన్నలు… నేను చచ్చిపోతే అమ్మానాన్నలు ఏమైపోతారు అని ఒక్క క్షణం అలోచించి ఉంటే, రోజు లాగానే ఈ రోజు ఉండేది, నువ్వు ఒక్క క్షణం ఆలోచంచలేదు కాబట్టే మీ ఇల్లు ఇప్పుడు శోకంతో నిండిపోయింది, అమ్మానాన్నలకి కడుపుకోత మీదిలింది.