ప్రాంతీయం

సమ్మె నోటీసు అందజేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు

94 Views

 

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులుగా నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్నందున తమను ఎగ్జామ్ నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా సర్వీస్ తో కూడిన రెగ్యులరైజేషన్ చేయాలని తమ కార్యాచరణ మరియు సమ్మె నోటీసు జగదేవపూర్ ఎంపీడీవో గారికి జూనియర్ కార్యదర్శులు ఈరోజు సమ్మె నోటీసు అందజేశారు. *గత మూడు సంవత్సరాల నుండి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ అవార్డులలో దాదాపు తెలంగాణకి రాష్ట్రంలోని గ్రామాలకె అన్ని అవార్డులు దక్కాయి*, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పల్లె ప్రగతి, డంపింగ్ షెడ్డు, వైకుంఠధామం, హరితహారం, గ్రీనరీ, రికార్డుల నిర్వహణ, ఉపాధి హామీ పనులు, విలేజ్ పార్కులు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వీధిలైట్లు, CC రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, రైతు వేదికలు, రైతుల కల్లాలు, పశువుల కొట్టాలు, ఇంటి పన్నులు, ప్రతిరోజు పాఠశాలలు అంగన్వాడీలు శుభ్రం చేయడం, నీళ్ల ట్యాంకులను శుభ్రం చేయడం, ఇంటింటికి మిషన్ భగీరథ నీటి సరఫరా, గ్రామ నర్సరీ మొక్కల పెంపక కేంద్రాలు, ప్రతి నెల ఆసరా పెన్షన్ పంపిణీ, బతుకమ్మ చీరల పంపిణీ, కంటి వెలుగు కార్యక్రమం, జ్వరం సర్వే, ఇండ్ల సర్వేలు, జనన మరణ వివాహ ధ్రువీకరణ పత్రాల జారీ, 42 రకాల రికార్డుల నిర్వహణ, ప్రతిరోజు ఆన్లైన్లో రిపోర్టులు పెట్టడం,గ్రామ ప్రజా ప్రతినిధులను సమన్వయ చేసుకోవడం, ప్రభుత్వ లక్ష్యాలను వారికి వివరించడం, గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులు గ్రామ సర్పంచుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తున్నారు,

దేశంలోనే ఏ ఉద్యోగి కైనా రెండు సంవత్సరాల ప్రోబిషన్ పీరియడ్ ఉంటు పే స్కేల్ కూడా ఇస్తారు కానీ తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగులకు మూడు సంవత్సరాలు పెట్టి నెలకు 15 వేల జీతం మాత్రమే ఇచ్చారు,వీరు నాలుగు సంవత్సరాల క్రితం కాంపిటీషన్ ఎగ్జామ్ ద్వారా దాదాపు ఆరు లక్షల మంది పోటీపడి రాసిన పరీక్షలో మెరిట్ సాధించి రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా డిగ్రీ అర్హత ద్వారా నెగిటివ్ మార్కింగ్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు, మొదట మూడు సంవత్సరాలు ఉన్న ప్రొబేషన్
పీరియడ్ను గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం నాలుగు సంవత్సరాలకు పొడిగించారు ఆ నాలుగు సంవత్సరాల గడువు కూడా ముగిసినందున తమను వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ప్రభుత్వం స్పందించని యెడల కార్యచరణ మేరకు నడుచుకుంటామని ఏప్రిల్ 28 నుండి నిరవధిక సమ్మెకు వెళుతున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగరాజు, గజ్వేల్ డివిజన్ కోఆర్డినేటర్ ప్రశాంత్, మండల అధ్యక్షుడు వేణు, జనరల్ సెక్రెటరీ సత్యం, మరియు ఇతర కార్యదర్శులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *