తోగుట: చందాపూర్ లో శుక్రవారం రోజున ప్రపంచ మేధావి డా”బి.ఆర్.అంబెడ్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ బొడ్డు నర్సింలుయాదవ్ గ్రామపంచాయితీ లో డా.బి.ఆర్అంబెడ్కర్ గారి చిత్రపటానికి పూవుల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ మ
ట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి డా”భీంరావ్ రాంజీ అంబేడ్కర్ గారు అని అన్నారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి. చందా సత్తయ్య.మాజీ సర్పంచ్ బెజగమా కిష్టయ్య.అజీమ్.మోహినొద్దిన్. సుభాష్.కవిత. సర్ణలతా.లక్ష్మి.మల్లయ్య.కిష్టయ్య పెంటయ్య తదితరులు పాల్గొన్నారు




