ప్రాంతీయం

భారత రాష్ట్రసమితి కుటుంబం ఆత్మీయ సమ్మేళనం…

226 Views

ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఏప్రిల్ 12,  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేకసంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కేసిఆర్ కు దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని జిల్లాలలో సస్యశ్యామలంగా చేయడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలియజేశారు. ఎలక్షన్లో మళ్లీ తెలంగాణ గడ్డపైన బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని అలాగే మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలతో నయా పైసా లంచం లేకుండా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ప్రతి ఇంటికో నల్ల, ప్రతి పేదవాడికి అందేలా చూస్తామని, మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ అందరివారికి ఎవరికి స్థలం ఉంటే వారికి పక్కా మూడు లక్షల రూపాయలు అందజేసేలా ప్రజాప్రతినిధులే చూస్తారని అన్నారు. ఏ ఒక్క ఇల్లులేని నిరుపేద కుటుంబం కంటతడి పెట్టకుండా చూసే విధంగా మంజూరు చేస్తామన్నారు. మళ్లీ బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చి అధిక మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ప్రజలను కోరాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్య, రైతుబంధు అధ్యక్షులు కలవకుండా గోపాలరావు, మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, రాష్ట్ర నాయకులు డా. చంద్రశేఖర్ రావు, ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు తోటఆగయ్య, సంతోష్ రావు, రమేష్ రెడ్డి, ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాల హోదాలు కలిగినటువంటి సర్పంచులు, ఉప సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీలకు, జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ వేదిక పైన ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, కార్యకర్తలకు ప్రజలందరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *