ఈ రోజు జగదేవపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది ఇఫ్తార్ విందులో జగదేపూర్ మండల వ్యాప్తంగా ఉన్న మైనారిటీ సోదరులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా జగదేవపూర్ మండల మైనార్టీ సోదరులు వంటేరు ప్రతాప్ రెడ్డి గారిని టోపీ ధరించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక ఆన్నారు. హిందూ ముస్లింల మధ్య సోదర బావాన్ని పెంపొందించేందుకు ఈ ఇఫ్తార్ విందులు ఎంతగానో దోహదపడుతాయి అన్నారు.రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది అన్నారు. అల్లాహ్ దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు,తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు అందిస్తున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముస్లిం సోదరులకు షాదీ ముబారక్, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లోన్లు మరియు రంజాన్ కానుకగా దుస్తుల పంపిణీ లాంటి అనేక పథకాలను ముస్లిం సోదరులకు అందించడం జరుగుతుందన్నారు. గజ్వేల్లో నిరుపేద ముస్లింల ఆడబిడ్డల పెళ్ళికి షాది ఖానా నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం లాంటివి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు,మైనార్టీ విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 408 మైనారిటీ గురుకుల విద్యాసంస్థలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. ఈ విద్యాసంస్థలలో రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ పాఠశాలలకు, కళాశాలలకు ధీటుగా కార్పొరేట్ స్థాయి విద్యను మైనార్టీ విద్యార్థులకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు,ముఖ్యమంత్రి విదేశీ విద్యా స్కాలర్షిప్ పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అర్హులైన మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం తరఫున రూపాయలు 20 లక్షల గ్రాంటును అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అన్నారు,గత పాలకులు ముస్లింలను ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేవారన్నారు, ముస్లింల ఉన్నతికి అనేక పథకాలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏటా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు, మసీదులకు, ఈద్గాలకు అభివృద్ధి, మరమ్మతులకు నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు, పేద ముస్లింలకు బట్టల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు,సమాజంలో అన్ని వర్గాలు బాగుంటేనే అది మంచి సమాజం అవుతుందని నమ్మిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు, సబ్బండ వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్దపీట వేస్తున్నారు అన్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పి ఎస్ ఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్,ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పండుగల శ్రీనివాస్ గౌడ్, మండల కో ఆప్షన్ ఇక్బాల్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాచర్ల నరేష్ గుప్తా, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కిరణ్ గౌడ్,pacs పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి,కొండపోచమ్మ టెంపుల్ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎంపిటిసి కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జగదేవపూర్ గ్రామ అధ్యక్షుడు నాగరాజు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరసత్ అలి,నవాజ్ మీరా అహ్మద్, జహంగీర్,ఖాజా పాషా, ముస్లిం మైనారిటీ సోదరులు తదితరులు ఉన్నారు.
