మద్యం సేవించి వాహన నడిపిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష…..
-వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 10, తెలుగు న్యూస్ 24/7
సిద్ధిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో ముస్తాబాద్ చౌరస్తా,ఎంపీడీవో ఆఫీస్,చౌరస్తా ,లలోవాహనాలు తనిఖీ చేయగా, పొన్నాల గ్రామానికి చెందిన మచ్చ తిరుపతి రెడ్డి, తండ్రి పుల్లారెడ్డి ,మద్యం సేవించి నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా ఫిబ్రవరి 10,సిద్దిపేట ప్రత్యేక రెండవ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ముందు హాజరు పరచగా వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు.ఈ సందర్భంగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు,మాట్లాడుతూమద్యం సేవించి వాహనాలు నడవదని, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్,నిర్వహించడం జరుగుతుందన్నారు..





