
కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.జగదేవపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంను బుధవారం స్థానిక సర్పంచ్ రజిత రమేష్,ఎంపీటీసీ కావ్య ధర్గయ్య తో కలిసి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంటఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి,నాయకులు కనకారెడ్డి,నజీర్, స్వామి, కిషన్,సత్యనారాయణ, కనకయ్య,కృష్ణ,నాగరాజు,మహేష్,శ్రీను, కార్యదర్శి ప్రశాంత్,వార్డు సభ్యులు మహిపాల్, రవి,కుమార్,వైద్య సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




