ప్రాంతీయం

మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సమీక్ష సమావేశం.

21 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సమీక్ష సమావేశం.

కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నిర్మాణంలో కొత్త ప్రక్రియకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టనుందనీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, మంచిర్యాల నియోజకవర్గ అడ్వైజర్ జంగా రాఘవరెడ్డితో పాటు పీసీసీ సభ్యులు రామ్ భోపాల్ తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్నీ నింపారు. కాంగ్రెస్ పార్టీ నీ బూత్ లెవల్ స్థాయి నుండి గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలో పటిష్టపరచాలని అన్నారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న కార్యకర్తలను పార్టీ నాయకత్వం గుర్తిస్తుందని ఎవరు కూడా అధైర్య పడకుండా పని చేయాలని సూచించారు. పదవులు కోసం కాకుండా పార్టీ కోసం పని చేస్తే ఎన్నో అవకాశాలు వస్తాయని అన్నారు. 2017 కన్నా ముందు నుండి పార్టీ కోసం పని చేస్తున్న వారిని గుర్తించి అధిష్టానానికి తెలియజేస్తానని తెలిపారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అంకిత భామమే అని కొనియాడారు. కష్టపడ్డవారికే భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశాలు కల్పిస్తామని అన్నారు. బూత్, గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్