పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు
ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంపీపి పిల్లి రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు లు అన్నారు.
ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆరుగురు లబ్ధిదారులైన ఎర్రబెల్లి స్వర్ణలత, గెంటే లక్ష్మి, చిట్టి భారతమ్మ, గుడి లలిత, ఎరుపుల బాలమణి, ఎనగందుల భూమవ్వ లకు ఆరు లక్షల 696 రూపాయల చెక్కులను శుక్రవారం ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి లు కలిసి పంపిణీ చేశారు ,
ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, పథకం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
ఆడబిడ్డలకు ఒక మేనమామ లాగా కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పలు ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆమే
అన్నారు,
రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు మద్దతుగా నిలిచి మళ్లీ గెలిపించాలని ప్రజలకు ఆమే విజ్ఞప్తి చేశారు ,
జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.
కళ్యాణ లక్ష్మి పేదలకు ఒక వరం లాంటిదని పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు పెద్దన్నలా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు , ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు,
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పందిళ్ళ నాగరాణి పరిసరాములు గౌడ్, ఎలగందుల అనసూయ నర్సింలు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , సింగిల్ విండో డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి , వార్డు సభ్యులు గడ్డమీది లావణ్య , మండల మహిళా అధ్యక్షురాలు అప్సరా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సీత్యా నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు గోషిక దేవదాసు, యూత్ అధ్యక్షులు కళ్యాణ్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు నేవూరి జగన్ రెడ్డి, మీసం రాజం , మేఘి నరసయ్య , మెండే శ్రీనివాస్ యాదవ్, బందారపు బాల్ రెడ్డి, అజ్జు బాయ్ , కటుకం శంకర్ , బిఆర్ ఎస్ పార్టీ యూత్ లీడర్స్ శివరామకృష్ణ, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు,



పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు


