మాత శిశు & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే.
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని నూతనంగా నిర్మిస్తున్న మాత శిశు & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాల పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ అనుకున్న సమయానికి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలందరికీ వైద్య సేవలను అందిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





