ప్రాంతీయం

అనంతరావు పల్లి దుర్గామాత విగ్రహప్రతిష్ట కోసం గోలి సంతోష్ విరాళం

118 Views

అనంతరావు పల్లి దుర్గామాత విగ్రహప్రతిష్ట కోసం గోలి సంతోష్ విరాళం దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని జగదేవ్పూర్ మండలం కొండపోచమ్మ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ గోలి సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం గజ్వేల్ మండలం అనంతరావు పల్లి గ్రామంలో ఏర్పాటు చేసే దుర్గ మాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి 11 వేల 116 రూపాయలను సర్పంచ్ మహేందర్ యాదవ్ కు ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే అనంతరావు పల్లి గ్రామంలో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట సహకారం అందించినట్లు ఆయన తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు సహకారం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో కూడా దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకారమందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండటం వల్లే ఇంత అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 2023 లో కూడా తెలంగాణ ప్రభుత్వం తిరిగి అధికారంకు వస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్ యాదవ్, కొండపోచమ్మ డైరెక్టర్ రామస్వామి, మాజీ సర్పంచ్ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *