అక్టోబర్ 04 మంచిర్యాల జిల్లా
వేములపల్లి మండలం నిల్వాయిగ్రామం లోబుధవారం పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది.
గ్రామంలో పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, బుధవారం ఉదయం పులి ఆవు, దూడ మీద దాడి చేసినట్లుగా గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పులి పాద ముద్రలను పరిశీలించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
వీలైనంత తొందరగా పులిని పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
