గౌడ సంఘానికి 310 గజాల స్థలం వితరణ చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్
– ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం హర్షం
ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘానికి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ 310 గజాల సొంత స్థలాన్ని ఇచ్చినట్లు ఆయన శనివారం ప్రకటించారు.ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం మండల అధ్యక్షులు ముస్కం దత్తాద్రి గౌడ్ అధ్యక్షతన సమావేశం సాయి శివ పంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశానికి
ముఖ్యఅతిథి గా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మట్లాడుతూ మండల గౌడ సంఘానికి స్వంత భవనం మండల కేంద్రంలో ఇప్పటివరకు లేకపోవడం విచారణ కరమన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా స్థలం మండల గౌడ సంఘానికి ఇవ్వడమే కాకుండా భవన నిర్మాణానికి కూడా తన స్వంత ఖర్చులను వెచ్చించనున్నట్లు ప్రకటించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో పెట్రోల్ బంక్ దగ్గర స్థలం ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంక్షేమ సంఘం డైరెక్టర్ గంట వెంకటేష్ గౌడ్, బొల్గం రంగయ్య, కదిరి భాస్కర్, గంట బాలగౌడ్, గంట కార్తీక్ గౌడ్, కొండ రమేష్ గౌడ్, బాలరాజు నర్సాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
