గజ్వేల్ పట్టణంలో మంగళవారం నాడు11 వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించిన వార్డు కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవీందర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ వార్డు ప్రజలందరికీ కంటికి సంబంధించిన సమస్యలు ఉంటే పరీక్షా శిబిరానికి వచ్చి, సమస్యలను పరిష్కరించుకొని ఉచితంగా మందులు, కండ్ల అద్దాలు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ శిబిరానికి వచ్చే ప్రజలు ఆధార్ కార్డు. రేషన్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డు వెంట తీసుకొని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, వార్డు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.