ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా అభివృద్ధి సమీక్ష

120 Views

సిద్దిపేట పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల పై సుడా చైర్మన్ రవిందర్ రెడ్డితో కలిసి సిద్దిపేట సుడా కార్యలయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ మునిసిపల్, సుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.  పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుండి పొన్నాల జంక్షన్ వరకు మరియు అంబేద్కర్ చౌరస్తా నుండి వేములవాడ కమాన్ వరకు మద్యలో చెట్లు వేపుగా పెరగడం వల్ల సెంట్రల్ లైట్ రాత్రి సమయాలలో సరిగ్గా కనిపించడం లేదు కావున వాటి స్థానంలో స్ట్రీట్ లైట్, పుట్ పాత్ పైన మాండ్రన్ లైట్ల ను అమర్చాలని సూచించారు. నమూనాగా వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో పర్యటించి అందరికీ సౌకర్యంగా ఉండేదిగా ఉన్నాయా అని ఓక సారి చూసీ రావాలని అధికారులకు తెలిపారు.

పట్టణం మొత్తం ఓకే విధమైన లైటింగ్ కాకుండా వేరు వేరుగా మంచి డిజైన్ తో కుడినవిగా ఎంపిక చేయ్యాలన్నారు.

ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ ను నియంత్రించడానికి హౌసింగ్ బోర్డు కమాన్ నుండి ఎన్సాన్ పల్లి రోడ్డు వరకు 4వరుసల రహదారిగా మార్చడానికి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయ్యాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. ప్రతిది జాగ్రత్తగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తయారీ ఉండాలన్నారు.

అలాగే పట్టణంలోని కప్పలగుంట చెరువు, మచ్చ వాయుకుంట చెరువు సుందరీకరణ చెయ్యాలన్నారు. ఇరిగేషన్ ఈఈ రెండు చెరువుల భూముల వివరాలను త్వరగా అందించాలని సూచించారు. తర్వాత సుందరీకరణకు సంబందించిన ప్రణాళికలను సిద్దం చెయ్యాలన్నారు.

* పట్టణంలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి అంబేద్కర్ జయంతి రోజు ఎట్టి పరిస్థితుల్లో భవనంకి సంబందించిన అడ్మిన్ సాంక్షన్ ను మంత్రి చేతుల మీదుగా అందించాలన్నారు.

 

అనంతరం ఎన్సాన్ పల్లి రోడ్డు నుండి హౌసింగ్ బోర్డు కమాన్ వరకు 4 వరసల రహదారి నిర్మించే ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 1.2 కిలోమీటర్ల దూరం 80 పిట్ల వెడల్పుతో మద్యలో 1.5 మీటర్ డివైడర్ తో నిర్మాణం ఉంటుందన్నారు. ఇంజనీరింగ్ అధికారులతో టేప్ తో కొలతలు చెపించారు. మొత్తం టేప్ తో కొలిచి అడ్డుగా ఉన్న నిర్మాణాలకు రోడ్డు కు కావలసిన మార్కింగ్ త్వరగా ఇవ్యాలని అధికారులకు తెలియజేశారు. రోడ్డు ప్రక్కన విద్యుత్ స్తంభాలను పక్కకు జరపాలని విద్యుత్ శాఖ అధికారులతో పోన్ లో మాట్లాడారు.

 

అనంతరం సుడా పరిధిలో గల మిట్టపల్లి శివారులో అత్యద్భుతమైన రీతిలో నిర్మించబోతున్న మాడ్రన్ లేఔట్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లేఅవుట్ నిర్మాణ పనులను మ్యాప్ ద్వారా ఏజెన్సీ కలెక్టర్కు వివరించారు. 14 ఎకరాలు విస్తీర్ణంలో సుమారుగా 160 ప్లాట్ల తో నేషనల్ హైవే కు 80 మీటర్ల దూరంలో నిర్మిస్తున్నామని తెలిపారు. లేఅవుట్ ను ఎక్కడా లేని విధంగా మధ్యలో అధునాతన పద్దతిలో వెడల్పు రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్ తో నిర్మిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న దరకే అందించాలని తెలిపారు. నిర్ణీత గడువు లోపు లేఅవుట్ పనులను పూర్తి చేయ్యాలని తెలిపారు.

 

కలెక్టర్ వెంట సుడా వైస్ చైర్మన్ రమణాచారి, మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మాజి మునిసిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్స్, ఈఈ ప్రసాద్, లే అవుట్ ఎజెన్సీలు, సూడా, మునిసిపల్ అధికారులు తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *