విద్యార్థులు పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని మర్కుక్ సర్పంచ్ అచ్చగారి భాస్కర్ సూచించారు. శనివారం మర్కుక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, సదుర ప్రాంతాలనుండి వస్తున్న విద్యార్థులకు రవాణా సౌకర్యంలో ఇబ్బందులు కలకుండా తమ స్వంత ఖర్చులతో ఆటోలను ఏర్పాటు చేస్తామని హమీనిచ్చారు.విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్ భాస్కర్ పోటో ఉన్న కప్పు మెమోటోను అందజేశారు.





