ప్రాంతీయం

శుభ వేడుకలో పాల్గొన్న టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) జిల్లా నాయకులు

137 Views

శుభ వేడుకలో పాల్గొన్న టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) జిల్లా నాయకులు

ఖమ్మం, ఫిబ్రవరి 04, తెలుగు న్యూస్ 24/7

టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు కందరబోయిన నాగకృష్ణ అక్క కంభం శ్రీదేవి, బావ కంభం రాము దంపతుల కుమారుడు శ్రీనివాస్‌, కూతురు ఝావేరి ల పంచెకట్టు–ఓణీల వేడుకలు ఖమ్మం నగర స్థానిక కరుణగిరి సమీపంలో గల వారి నివాసంలో బంధుమిత్రుల నడుమ కనుల పండుగగా జరిగింది. ఈ శుభకార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నాయకులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం నాయకులు నాగకృష్ణ మేనల్లుడు,మేనకోడల లను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.జిల్లా నాయకులు మాట్లాడుతూ ఇలాంటి శుభకార్యక్రమలలో బంధుమిత్రుల మధ్య,కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయని, ఆనందాన్ని పరస్పరం పంచుకునే అవకాశం కల్పిస్తాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి, జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్, టీబీజేఏ ఖమ్మం నగర అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, నగర కోశాధికారి కప్పల మధు, వనం నరేష్, పొదిలపు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *