జగదేవపూర్ మండలంలోని ఆనంతసాగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలనీ కోరుతూ శనివారం సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి లతో కలిసి హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు కి సర్పంచ్ లావణ్య మల్లేశం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలపై హరీష్ రావును కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజురు చేయాలనీ కోరామన్నారు. దానికి మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆనంతసాగర్ గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించినట్లు వారు తెలిపారు.