తల్లిదండ్రులు లేని అనాధ యువతి వివాహానికి మేమున్నామంటూ మానవతావాదులు మానవత్వంతో ముందుకు వచ్చి వివాహ పెద్దలుగా మారి సాస మౌనిక – నరసింహ నూతన వధూవరుల వివాహం జరిపించారు. ఎవరు లేరని అధైర్య పడవద్దు, అండగా ఉంటామని మానవత్వం చాటుకున్నారు. సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్. నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తల్లిదండ్రులు లేని యువతి సాస మౌనిక – ఎండపల్లి నరసింహ వధూవరుల వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించి వాషింగ్ మిషన్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు నా అనేవారు ఎవరు లేరని ఎప్పుడు కూడా కృంగిపోవద్దని ఎంతోమంది మానవత్వంతో అండగా నిలబడతారని మనోధైర్యంగా ఉండాలని అధైర్యపడవద్దన్నారు. కనీసం ఊరు పేరు అడ్రస్ కూడా లేని యువతిని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చిన నరసింహను ప్రత్యేకంగా అభినందించి జీవితాంతం తల్లిదండ్రులు లేని లోటు లేకుండా క్షేమంగా చూసుకోవాలని సూచించారు. అలాగే మౌనిక-నరసింహ వధూవరుల వివాహానికి తల్లిదండ్రుల్లాగా బాధ్యత తీసుకొని పెళ్లి పెద్దగా వ్యవహరించి వీరి వివాహం చేసినందుకు బాలల సంరక్షణ సమితి సభ్యులు దేశబోయిన నర్సింలు, బాలల పరిరక్షణ అధికారి రాజులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు దేశబోయిన నర్సింలు, అంజమ్మ, మంజుల, బాలల పరిరక్షణ అధికారి బూరుగుపల్లి రాజు, సామాజిక కార్యకర్త మహమ్మద్ ఉమర్, ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు, ఇంతియాజ్ బాబా తదితరులు పాల్గొన్నారు.
