ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి31, పోతుగల్ గ్రామం వాస్తవ్యులు పూర్ణచందర్ రావు జన్మదిన సందర్భంగా బంధనకల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 40, సైకిళ్లు పంపిణీ చేశారు. సభ వేదికపై ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రతిఒక్క విద్యార్థులు తల్లి, తండ్రి గురువులను తోటి విద్యార్థీని విద్యార్థులను పరస్పర గౌరవించడం నేర్చుకోవాలని మంచిగా చదువుకొని ఉత్తీర్ణులై ప్రయోజకులై ఉన్నత స్థాయికి ఎదగాలని వారన్నారు. బంధనకల్ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు పొరుగు గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు పూర్ణచందర్ రావు జన్మదిన సందర్భంగా గుర్తింపు ఉండాలని కేక్ కట్ చేసి అనంతరం సైకిళ్లను విద్యాకమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, అక్కరాజు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ
రామారావు, మేరుగు యాదగిరి గౌడ్, ఎంపిటిసి రామచంద్రారెడ్డి, వెంకట్రావుపల్లి సర్పంచ్, ఉపసర్పంచ్ తిరుపతిరెడ్డి, బీసీస్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లవెంకటస్వామి, చిగురు నరేష్, మారెడ్డి వెంకట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రవి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




