ప్రాంతీయం

సీతారాములోరి కళ్యాణం – కమనీయం… అత్యంత వైభవపీతంగా నిర్వహించారు…

557 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి30, పోతుగల్ గ్రామంలో భక్తులు  చైత్ర :శుద్ధ: నవమి పురస్కరించుకుని శ్రీసీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సీతారాముల విగ్రహాలను శిల్పకళా శోభితమైన వాహనంపై శ్రీరామ నామస్మరణతో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.
ముందుగా శ్రీరామునికి నిత్యార్చనలు, పూజలు చేశారు.కళ్యాణమండపం మధ్యలో స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా రజితాసనంపై కూర్చుండబెట్టి వేదపండితులు.. వేదమంత్రోచ్ఛారణ గావిస్తూ ఆరాధనలు జరిపారు. కోదండ రాముని కృపకు పాత్రుడైన శ్రీరామదాసు చేయించిన నగలను.. అలంకరించి.. తేనె, పెరుగులను నైవేధ్యంగా అందించారు. కళ్యాణ దుస్తులతో సాక్షాత్ లక్ష్మీనారాయణుల అవతారమైన సీతారాములకు ధరింపజేశారు. ఇంతలో అభిజిత లగ్నం సమీపించటంతో జీలకర్ర, బెల్లంలను ఉంచారు. భక్తరామదాసు చేయించిన మంగళసూత్రం అమ్మవారికి ధరింపజేయడంతో వివాహమహోత్సవం ముగిసింది. చివరగా.. స్వామి, అమ్మవార్ల తలంబ్రాల కార్యక్రమం ఎంతో అద్భుతంగా.. కన్నులకింపుగా సాగింది. రామ రామ అంటూ భక్తులు తమకు తోచిన రీతిలో సీతారామ స్మరణ గావించారు. ఈపట్టాభిరామ ఈఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌతమ్ రావు, అక్కరాజు శ్రీనివాస్, తోట ధర్మేందర్, ఉపసర్పంచ్ నాంపల్లి, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *