8అడుగుల శ్రీరాముని భారీ చిత్రాన్ని అవాలతో చిత్రించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం శ్రీరామనవమి సందర్భంగా అందాల శ్రీరాముని చిత్రాన్ని 8అడుగుల భారీ పొడవుతో అత్యద్భుతంగా చిత్రాన్ని అవాలతో వినూతనంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి రామభక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిలా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక,అధ్యక్షులు రామకోటి రామరాజుఈ సందర్భంగా మాట్లాడుతూ 3రోజుల పాటు భక్తితో చిత్రాన్ని చిత్రించానన్నాడు. రామ నామమే శాశ్వతమని ప్రతి ఒక్కరూ రామకోటి వ్రాయాలని కోరారు. వ్రాయనివారు ఈరోజు నుండి ప్రారంభించాలని రామకోటి ఉచిత పుస్తకాల కొరకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.2రోజుల పాటు భక్తుల సందర్శనార్థం సత్యసాయిబాబా మందిరంలో ఉంచనున్నట్లు తెలిపారు.
