సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక పరిధిలోని దుంపలపల్లిలో ఆదివారం ఘనంగా పోచమ్మ ఉత్సవాలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ యేడు పాడి పంట, గొడ్డు, గోదా అమ్మవారి దయతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. మెదక్ ఎంపీకి దుంపలపల్లి వార్డ్ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్, ఉత్సవ నిర్వహికులు ఎంపీ ని శాలువాతో సత్కరించారు.
సీఎం ఆర్ఎఫ్ చెక్కులు అందజేత
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి వార్డులో లబ్దిదారులకు కౌన్సిలర్ ఇల్లందు శ్రీనివాస్, చైర్పర్సన్ గన్నే వనిత, వైస్ చైర్పర్సన్ అధికం సుగుణ బాలకిషన్ తో కలిసి సీఎం ఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు ధర్మరపు ఎల్లవ్వ, అధికం పోచవ్వ, ఎద్దు పోచవ్వ,ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బొంబాయి చంద్రయ్య, జానయ్య, యాదగిరి, రవి గౌడ్, పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.