బూరుగుపల్లి గ్రామంలో గజ్వేల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 రోజుల ఎన్ఎస్ఎస్ క్యాంపులో పాల్గొని NSS క్యాంపును ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ క్యాంప్ బూరుగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు,ఎన్ఎస్ఎస్ క్యాంపులో పాల్గొంటున్న విద్యార్థులను అభినందించారు,ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు ప్రణాళికబద్దమైన కార్యకలాపాలు, వర్క్ షాప్ లు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్లు, నిర్వహించడం ద్వారా యువతల లో సామాజిక వ్యక్తిగత విద్యా రంగాల సమాచారం అవగాహన కలిగిన వ్యక్తిగా స్వీయ సాధికారత ఎంపికలు చేసుకోవచ్చన్నారు, విద్యార్థులు ప్రతి ఒక్కరి లోను సేవా దృక్పథం ఉండాలన్నారు, విద్యార్థి దశ నుండే సేవాభావాలను పెంపొందించుకోవాలని విద్యార్థులను సూచించారు, విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, విద్యా ప్రాముఖ్యత, వాటి గురించి విద్యార్థులను సూచించాలాని తెలిపారు,
ముఖ్యంగా యువకులు ప్రజలలో చైతన్య తీసుకురావాలన్నారు, గ్రామంలోని పరిసరాలు శుభ్రం చేస్తూ యువకులలో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి పచ్చదనం పరిశుభ్రత పై ఆరోగ్యం పై అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్ర గ్రామాల పట్టణాల యొక్క రూపురేఖలను మార్చాయని అన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ వంటేరు విజయవర్ధన్ రెడ్డి, ఎంఈఓ సునీత, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ A శ్రీనివాస్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయభాస్కర్ రెడ్డి, మండల కో ఆప్షన్ అబ్దుల్ కళాశాల విద్యార్థులు గ్రామస్తులు తదితరులున్నారు తదితరులున్నారు




