సమాజ సేవే ఎల్లాగౌడ్ ట్రస్ట్ లక్ష్యం
– ట్రస్ట్ చైర్మన్ రంగా వెంకట్ గౌడ్
సిద్దిపేట్ జిల్లా జూన్ 10
సమాజ సేవ కార్యక్రమాలు లక్ష్యంగా ఎల్లాగౌడ్ ట్రస్ట్ పని చేస్తుందని ట్రస్ట్ చైర్మన్ రంగా వెంకట్ గౌడ్ అన్నారు. సోమవారంజగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో అంగన్వాడి కేంద్రాలకు సీలింగ్ ఫ్యానులు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి రంగా ఎల్లాగౌడ్ జ్ఞాపకార్థంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామంలో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
అందులో భాగంగా అంగన్వాడి టీచర్లు ఫ్యాన్లు లేవని పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.
వెంటనే ట్రస్ట్ ద్వారా సీలింగ్ ఫ్యానులు అందించడం జరిగిందని చెప్పారు.
అలాగే గ్రామంలో అన్ని రకాల సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు అనంతరం అంగన్వాడి టీచర్లు ట్రస్ట్ చైర్మన్ వెంకట్ గౌడ్ కు అభినందనలు తెలిపారు.
