బయ్యారం గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీ రాజ్ అవార్డు గ్రామ సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి గ్రామపంచాయతీ సెక్యూరిటీ నరేష్ కు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అవార్డును అందజేసి శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎఫ్బిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, జడ్పిటిసి పంగా మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బయ్యారం గ్రామ సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బయ్యారం గ్రామానికి జాతీయస్థాయి అవార్డు రావడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ జాతీయస్థాయి దీన్ దయాల్ పంచాయతీ రాజ్ పురస్కార్ అవార్డులలో భాగంగా బయ్యారం గ్రామానికి రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధిలో భాగంగా పల్లె ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. బయ్యారం గ్రామ ప్రజలకు మరియు యువతకు అవార్డు రావడానికి కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.




